ఎడిట్ నోట్: యూసీసీ రగడ..! అసలు ఏంటి కథ.!

-

యూసీసీ..ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటున్న కొత్త చట్టం..అసలు యూసీసీ అంటే ఏంటి? దీన్ని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు ఏంటి దీని వెనుక కథ? అనేది ఒక్కసారి చూస్తే..ముందు యూసీసీ అంటే..యూనిఫామ్ సివిల్ కోడ్..ఉమ్మడి పౌర స్మృతి..దీని అర్ధం గురించి చెప్పే ముందు..దేశంలో ఇప్పటివరకు.. పెళ్లి, విడాకులు, ఆస్తి హక్కు, ఆస్తి పంపకాలు, విడాకుల తరువాత భరణం, రెండో పెళ్లి, దత్తత, వీలునామా, ఆడవాళ్లకు ఆస్తి హక్కు..ఇలా పలు అంశాల్లో ఒకే రకమైన చట్టాలు లేవు. దేనికి దానికే సెపరేట్ చట్టం ఉంది.

అలాగే హిందువులకు ఒక రకంగా ఉంటే, ముస్లింలకు మరొక రకంగా, క్రైస్తవులకు ఒక రకంగా, ఆదివాసీలకు వేరొక రకంగా చట్టాలు ఉన్నాయి. మతాల వారీగానే కాకుండా రాష్ట్రాల వారీగా కూడా వేర్వేరు చట్టాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఏపీలో ముస్లిం చట్టాలు..గుజరాత్ లో ముస్లిం చట్టాలు ఒకేలా ఉండవు. అలాగే పంజాబ్ హిందూ, కేరళ హిందూ ఆస్తి పంపకాల విధానాల్లో తేడాలున్నాయి. ఇలా రకరకాలుగా ఉన్నాయి.

kcr

అయితే ఇలా వేర్వేరుగా ఉన్న అన్ని చట్టాలనూ రద్దు చేసేసి, దేశమంతా రాష్ట్రాలకూ, మతాలకూ అతీతంగా ఒకటే చట్టాన్ని తీసుకురావలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. దీని ద్వారా మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరికీ ఒకటే న్యాయం వర్తిస్తుందని బి‌జే‌పి..దాని అనుకూల వర్గాలు చెబుతున్నాయి. కానీ కొన్ని విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.  ఇదే క్రమంలో తాజాగా యూసీసీని తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ వ్యతిరేకించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అభివృద్ధిని విస్మరించి ఉమ్మడి పౌర స్మృతి పేరిట దేశ ప్రజలను విభజించేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.

తాజాగా ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లాబోర్డు ప్రతినిధులు, ఎం‌ఐ‌ఎం అధినేత అసదుద్దీన్‌తో సీఎం ఈ బిల్లు సహా పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తుందని.. భావ సారూప్య పార్టీలతో కలిసి దీనిపై పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇక ఈ బిల్లుని వ్యతిరేకించాలని ఏపీ సి‌ఎం జగన్‌ని సైతం కోరతానని అసదుద్దీన్ అన్నారు. సమయం ఇస్తే ఆయన్ని కలుస్తామని అన్నారు. ఇలా యూసీసీకు వ్యతిరేకంగా కే‌సి‌ఆర్ గళం విప్పారు. అయితే పార్లమెంట్ లో బి‌జే‌పికి మెజారిటీ ఉంది..మరి ఈ చట్టంపై కేంద్రం ఎలా ముందుకెళుతుందో చూడాలి. భవిష్యత్‌లో ఈ చట్టం పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news