తిరుమల శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. నిన్నటి వరకు ప్రచారంలో మునిగిన రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆదివారం అంటే నవంబర్ 12న ఉదయం తిరుమల స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనమనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం.. తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చారు రేవంత్ రెడ్డి.