మీ పెద్ద నాన్న చంద్రబాబును అడిగి..నాపై పోటీ చేయ్‌ – ద్వారంపూడి

-

చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ కళ్యాణ్ కాకినాడ లో నా పై పోటీ చేయాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చురకలు అంటించారు. నారావారి వాహనంలో ద్వారంపూడి జపం చేస్తున్నాడని.. పవన్ కళ్యాణ్ కు స్క్రిప్ట్ టిడిపి ఆఫీస్ నుంచి వస్తుందని తెలిపారు.

లేని పోనీ నిందలు పవన్ నా మీద వేస్తున్నారని.. వ్యక్తిగతంగా ఉంటే మనం మనం చూసుకుందామని వివరించారు. పవన్ తన వ్యాఖ్యలు తో కాకినాడ కి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారు, జ్ఞానం తో మాట్లాడంటూ హెచ్చరించారు. బెస్ట్ లివింగ్ సిటీ ఆఫ్ ఇండియా గా కాకినాడ నాలుగవ స్దానము లో ఉందని.. పండించిన పంట మాకు ఇవ్వడానికి రైతులు అమాయకులా? అని నిలదీశారు. ఇరవై ఏళ్ళు గా మా కుటుంబము రైస్ బిజినెస్ లో లేము, ఎగుమతులు మాత్రం చేస్తున్నామని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news