నేడు సచివాలయంలో TSPSC పై రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు సచివాలయంలో టీఎస్‌పీఎస్సీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. టీఎస్‌పీఎస్సీ లో ఉన్న లోపాలు, కొత్త చైర్మన్‌ నియామకం, ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

కాగా, మెట్రో విస్తరణ, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. నిన్న ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ మెట్రోకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్ ఫోర్టు వరకు 32 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరిస్తామన్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్పోర్టు కి వెళ్లే మెట్రో లైన్ కు లింక్ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version