మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని, మాజీ మంత్రి డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని చూసి బీజేపీకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. కానీ సీఎం రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు కాంగ్రెస్కు వేటు వేయరన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని చూసి ప్రజలకు కాంగ్రెస్ కి ఓటు వేయలేదని.. బీఆర్ఎస్, కేసీఆర్ పై వ్యతిరేకతతోనే పార్టీకి ఓటు వేశారని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఇండియా కూటమి సభ్యులే ఒప్పుకోవడం లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని జోస్యం చెప్పారు. మోడీ మూడవ సారి భారత ప్రధాన కావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.