మా జోలికొస్తే చింతపండు అయితది – సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి దాడుల ఎపిసోడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న, మొన్న వాడొకడు, వీడొకడు మోపయ్యిండని అన్నారు. మా కార్యకర్తలపై దాడులు చేయాలని ప్రయత్నించారని మండిపడ్డారు.

కాంగ్రెస్ వాళ్లు ఎవరి జోలికి వెళ్లరని.. అదే సమయంలో ఎవరైనా మా వాళ్ళ జోలికి వస్తే ఊరుకోరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన ఇంటికి వస్తామని చెప్పిండ్రు.. కానీ మనవాళ్లే వాళ్ళ ఇంటికి వెళ్లారని అన్నారు. మా ఇంటికి వచ్చి తన్నారని ఇప్పుడు వాళ్లు చెబుతున్నారని అన్నారు రేవంత్. “రా.. చూసుకుందాం!” అని సంక నాకడానికి పిలిచావా మరి..? అని ప్రశ్నించారు.

మా జోలికి వస్తే చింతపండు అయితదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. “చూసుకుందాం రా” అని ముందు కౌశిక్ రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు. తాము రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని మాట్లాడిన వారు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ విరగడయ్యేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version