విద్యార్థులకు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజుల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. 2025-26లో ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
మరోవైపు విద్యాశాఖపై రేపు సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ లో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు, VCల నియామకాలు, ఇతర అంశాలపై సమీక్షిస్తారని సమాచారం.