తెలంగాణ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ధన్యవాదాలు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.

గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారన్నారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు…తెలంగాణలో ప్రజా స్వామ్య పునరుద్ధరణ లో మీ అందరి పాత్ర మరువలేనిదని తెలిపారు. ప్రతి ఒక్కరికి అభినందనలు అని చెప్పారు. శ్రీకాంతచారి తెలంగాణ కోసం అగ్నికణమై మండిన రోజు నవంబర్ 29… అమరుడైన రోజు డిసెంబర్ 3 అని.. డిసెంబర్ 3న రాబోయే ఎన్నికల ఫలితం వందలాది త్యాగధనుల ఆశయ సాధనలో తొలి అడుగు అన్నారు.