రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలు అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ మే 13వ తేదీన అలాగే జూన్ 4వ తేదీలలో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించేసింది. ఈ తేదీలలో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి.
కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ అలాగే దేశంలోని అన్ని లోక్సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ తరుణంలోనే ఈ రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్