తెలంగాణలో మంచి నీటి సమస్యలు రాకుండా రేవంత్‌ షాకింగ్‌ నిర్ణయం..!

-

తెలంగాణలో మంచి నీటి సమస్యలు రాకుండా రేవంత్‌ సర్కార్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా చేసేందుకు ప్రతీ మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ప్రతీ రోజు మంచినీటి సరఫరాను పర్యవేక్షించడానికి ప్రతీ మండలానికి జిల్లా స్థాయి అధికారిని, ప్రతీ వార్డు, గ్రామానికి మండల స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు.

Revanth’s shocking decision to prevent good water problems in Telangana

స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం జిల్లాలో మంచినీటి సరఫరాను పర్యవేక్షిస్తారని అన్నారు. ఏగ్రామంలోనైనా మంచినీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే, ఆయా గ్రామాల్లోని వ్యవసాయ బావుల నుండి అద్దె ప్రాతిపదికపై నీటిని సరఫరా చేయాలని సూచించారు.

వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని అందించాలన్నారు. ఇప్పటికే, అన్ని గ్రామాలు, వార్డులలోని బోరుబావుల మరమ్మతులు, ఫ్లషింగ్ లను పూర్తి చేయడంతోపాటు పైప్ లైన్ల లీకేజీలను అరికట్టడం జరిగిందని తెలియచేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి పాలేరు జలాశయానికి తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను విడుదల చేయడం జరిగిందని, ఈ జలాలు పాలేరు ప్రాజెక్టుకు చేరుకునేలా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news