‘గ్రేటర్’‌లో ముమ్మరంగా రోడ్ల రిపేర్‌.. ఎన్నికల హడావుడి స్టార్ట్‌??

హైరదాబాద్‌ మహానగరంలో ఎన్నికల హడావుడి ప్రారంభమైనట్లు తెలుస్తుంది.. గ్రేటర్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగంరలో రోడ్లన్నిపూర్తిగా దెబ్బతిన్నాయి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు.. మంత్రి కె.టి.ఆర్ ఆదేశాలతో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.. లక్డికాపూల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను మేయర్ స్వయంగా పరిశీలించారు.. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ఈ నెలాఖరులోగా మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలతో మెయిన్ రోడ్లు, గల్లీ రోడ్లు, సిసి రోడ్లను ఏకకాలంలో మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.. హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడకుండా సంబంధిత ఏజెన్సీలు, ఇంజనీర్లు రోడ్డు మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.


ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అర్థరాత్రి నుండి తెల్లవారుజామున 6 గంటలకు జరిగే రోడ్డు మరమ్మతు పనులలో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలకు సూచించారు. ఈ పునరుద్దరణ పనులను ఆయా ప్రాంతాలలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులు నాణ్యతలో లోపం లేకుండా తనిఖీలు చేపట్టాలని తెలిపారు. ఎక్కడ పాట్ హోల్స్ పడినా 24 గంటల వ్యవధిలోనే మరమ్మతులు చేపట్టి రవాణా సాఫిగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు..మేయర్‌ అకస్మిక తనిఖీలు నిర్వహించడంతో గ్రేటర్‌లో ఎన్నికల హడావుడి మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..


గ్రేటర్‌ పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరితో ముగియనుంది..దీంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు నెలల ముందే ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది.. ఈ నెల రెండో వారం నుంచి ఎన్నికల ప్రక్రియలను ప్రారంభించనుంది.. దీంతో రాజకీయంగా హైదరాబాద్‌ హీట్ ఎక్కనుంది..నవంబర్‌ మూడు వరకూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు దుబ్బాక ఉప ఉన్నికపై ఫోకస్ పెట్టాయి..

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి భాగ్యనగరం పడ్డంది..ఇప్పటికే కాంగ్రెస్‌ తన ఫోకస్‌ను గ్రేటర్‌ పై ఎన్నికలపై పెట్టింది..రోజు వారి సమీక్షలతో హస్తం పార్టీ దూకుడు పెంచింది..కాంగ్రెస్ తెలంగాణ కొంత ఇంచార్జ్‌ నేతలకు దిశ నిర్ధేశం చేస్తున్నారు..గ్రేటర్‌లో స్థానాల్లో బీసీ రిజర్వేషన్లపై పోరు బాట పట్టాలని నిర్ణయించారు..అవసరమైతే హైకోర్టుకు వెళ్లాలని అంతర్గతంగా చర్చించుకున్నట్లు సమాచారం.


మరోవైపు బీజేపీ కూడా గ్రేటర్‌ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది..దుబ్బాక ఎన్నిక ముందు బీజేపీ రాష్ట్రనాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడం కొంత బీజేపీకి నష్టం కలించినప్పటికి.. సికింద్రబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌ రెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి దక్కడం బీజేపీకి కలిసివచ్చే అవకాశం.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌లో పర్యటిస్తూ.. ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టుతున్నారు.. గ్రేటర్‌లో వరదలపై బీజేపీ శ్రేణులు రోజు వారిగా ఆందోళనలు చేస్తూ.. ప్రజల్లోకి చోచ్చుకుపోతున్నారు.