హైట్రిక్ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న సీఎం కేసీఆర్… ఇవాల్టి మేనిఫెస్టోలో కీలక హామీలను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రైతుబంధు సాయం కింద ఏడాదికి 16,000 ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. యాసంగి మరియు వానాకాలం సీజన్లలో ఒక్కో సీజన్కు ఎనిమిది వేల రూపాయల చొప్పున ఇస్తారని ప్రచారం సాగుతోంది.
కాదా తాము రైతుబంధు కింద ఏటా 15000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎం కేసీఆర్ ఈ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. ఆసరా పింఛన్లు, సాగు పెట్టుబడి సాయం పెంపు,బీఆర్ఎస్ మేనిఫెస్టోలో వంటగ్యాస్ సిలిండర్‌కు భారీగా సబ్సిడీ, తెలంగాణ రాష్ట్రమంతా పేద కుటుంబాలకు వర్తించేలా సీఎం కేసీఆర్ బీమా, నిరుపేద మహిళలకు నెలనెలా రూ.3 వేల ఆర్థికసాయం, ఎకరానికి 2 బస్తాల ఉచిత యూరియా వంటి హామీలు బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ఉండే అవకాశం ఉంది.