సంక్రాంతి వ‌ర‌కు రైతు బంధు ఉత్స‌వాలు : మంత్రి కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజుల నుంచి రైతు బంధు ఉత్స‌వాలను ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ రైతు బంధు ఉత్స‌వాల‌ను సంక్రాంతి వ‌ర‌కు కొన‌సాగించాల‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, రైతుల‌, ప్ర‌జ‌లు అంద‌రూ కూడా ఈ రైతు బంధు ఉత్స‌వాల‌ల్లో పాల్గోనాల‌ని పిలుపునిచ్చారు. కాగ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో కరోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తు రైతు బంధు ఉత్స‌వాల‌ను జ‌రుపుకోవాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు.

కాగ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది విడుద‌లుగా రైతు బంధు ను అమ‌లు చేశామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు బంధు ప‌థ‌కం అమ‌లు చేసిన నాటి నుంచి నేటి వ‌ర‌కు రూ. 50 వేల కోట్లను రైతుల అకౌంట్ లో జ‌మ చేశామ‌ని అన్నారు. ఈ విష‌యాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు తెలిసేలా ఉత్స‌వాలు జ‌ర‌పాల‌ని సూచించారు. దేశంలోనే మొద‌టి సారి ముఖ్య మంత్రి కేసీఆర్ రైతుల‌కు నేరుగా డ‌బ్బులు ఇచ్చే ప‌థ‌కం ప్రారంభించాని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news