సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనకు.. ఎన్ఎస్ యూఐ కి సంబంధం లేదు: బల్మూరి వెంకట్

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండకు ఎన్ఎస్ యూఐ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్. ఎన్ఎస్ యూఐ విద్యార్థులు రైలుకు నిప్పు పెట్టినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూన్నామన్నారు. అది అగ్నిపధ్ వ్యతిరేక యువకుల పనిగా తెలుస్తోందని అన్నారు. దీన్ని ఎన్ఎస్ యూఐ కి ఆపాదించడం సరికాదన్నారు. ఆర్మీ పరీక్ష రద్దు చేసిన కారణంగా 44 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.

ఆ బాధ తోనే పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులు ఈ పని చేశారని తెలిపారు. తనని కూడా పోలీసులు అరెస్టు చేసి శాహినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చారని తెలిపారు బల్మూరి వెంకట్. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి చేజారిపోయింది. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో కొంతమంది ఆందోళనకారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news