త్వరలో 16 బోగీలతో.. సికింద్రాబాద్‌- తిరుపతి వందే భారత్ రైలు

-

సికింద్రాబాద్‌- తిరుపతి- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్‌- తిరుపతి (20701) మధ్య మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే ప్రయాణ సమయం ఉండటంతో రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.  రిజర్వేషన్‌ దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైలులో ప్రస్తుతం 7 ఏసీ బోగీతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కారు బోగీ ఉంది. కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల స్పందిస్తూ.. సికింద్రాబాద్‌- తిరుపతి రైలుకు బోగీల సంఖ్య ఎందుకు తగ్గించారని ప్రశ్నించారని, సికింద్రాబాద్‌- విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుతో సమానంగా ఏర్పాటు చేయాలని ద.మ.రైల్వే జీఎంను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పెంచే ఆలోచనలో ఉంది. త్వరలోనే 16 బోగీలతో నడిపేందుకు ద.మ.రైల్వే ప్రణాళిక రూపొందిస్తోంది.

తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే నారాయణాద్రి, వెంకటాద్రి, శబరి, రాయలసీమ తదితర రైళ్లతో సామానంగా టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు. వందేభారత్‌ అందుబాటులోకి రావడంతో సాధారణ రైళ్ల కంటే వందేభారత్‌కు ఆదరణ మరింత పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news