అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు – రాహుల్ ఇష్యూపై సీతక్క

-

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని రాహుల్ ఇష్యూపై సీతక్క స్పందించారు. కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఫైరమోదీ ప్రభుత్వ దోపిడీని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు వేశారని ఆగ్రహించారు ఎమ్మెల్యే సీతక్క. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నది ఎంత వాస్తవమో, ఈ దేశం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధి గారి గొంతు నొక్కి ఆయన్ను ఆపాలనుకోవటం మీ తరం, ఎవరితరం కాదన్నారు.

ఇలాంటి కేసులు, బెదిరింపులకు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన కుటుంబం వారిదని… మహిళలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. మోడి అన్న పేరున్న వాళ్లకు దురదృష్టమో, అదృష్టమో ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అని అంటే.. రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎంపీగా అనర్హత వేటు వేయించారు… ప్రశ్నించే గొంతుకలను చూసి మోడి బీజేపీ ప్రభుత్వం ఎందుకింత బయపడుతుంది. . ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారు. మొన్న బిబిసి, నిన్న హిండెన్ బర్గ్, నేడు రాహుల్ గాంధీ అన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి, స్వాతంత్య్రం కోసం ఏళ్ల తరబడి జైలు జీవితాలు అనుభవించిన కుటుంబాలు వారివి. వారికున్న సొంత ఆస్తులను, వేలకోట్ల రూపాయిలు స్వాతంత్య్రం కోసం దారపోశారు…దివంగత ప్రదాని ఇందిరమ్మ తన ప్రాణాలిచ్చింది. దివంగత ప్రదాని రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారని వివరించారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news