పోలీసులను తోసుకుంటూ తరుముకుంటూ ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే సీతక్క. ఖమ్మం సభ నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సీతక్క ఫైర్ అయ్యారు. ప్రజల కోసం ప్రజా సమస్యల మీద దేశం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని… తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేతగా తమ నాయకుడు మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే, బిఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక ఎక్కడికక్కడ నిర్బంధంతో చెక్ పోస్ట్ లు పెట్టి నిర్భందిస్తున్నారని ఆగ్రహించారు.
బస్సులు రాకుండా బస్సులనివ్వకుండా ప్రైవేటు వెహికల్స్ ను రానీయకుండా చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం ఇది అత్యంత హెయమైనా చర్య అని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారన్నారు. ఉద్యోగులను ప్రైవేటు మీటింగ్లకు బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో కార్యకర్తలుగా ఉపయోగించుకొని… ఈ రోజు పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడుకొని మా సభను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీన్ని తెలంగాణ సమాజం ఖండించాలని కోరుతున్నామని.. బిఆర్ఎస్ నాయకులారా ఇది పద్ధతి కాదు చేతిలో మీ ప్రభుత్వం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖబద్ధార్ అంటూ హెచ్చిరంచారు.