బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లక్ష 50 వేల ఎకరాల భూమి అక్రమించుకున్నారని ఆరోపించారు. పదేళ్లలో జగదీష్ రెడ్డి చేసిన అరాచకాలపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో విభేదాలు నెలకొనడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గులాబీ పార్టీకి గుడ్ చెప్పిన వేముల.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే వేముల వీరేశానికి కాంగ్రెస్ నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగిన వేముల.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై ఘన విజయం సాధించారు.