రేవంత్ రెడ్డి దుబాయ్, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైలో.. ఏమేం చేసిండో చెప్తే.. భార్య, బిడ్డ కూడా ఇంటికి రానివ్వదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. నేను 2021 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెల్వదా..? అన్నారు. ఎవ్వడూ యాడేడా ఉండటో నాకు తెలువకుంట ఉన్నారా..? అని పేర్కొన్నారు.
స్వయంగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నే చెప్పిండు కదా.. పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి నాకు సహకరించింది కౌశిక్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమేం చేస్తాడో నాకు తెలవదా.. నేను చెబుతున్నా రేవంత్ రెడ్డి.. మీరు పర్సనల్ క్యారెక్టర్ అసేషనల్ చేస్తే నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేశావో జూబ్లీహిల్స్ లో ఏం చేశావో.. దుబాయ్, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో ఏమేమి చేశావో చెబితే ఎలా ఉంటుందో చూడు మళ్లీ అని పేర్కొన్నారు.