CM పదవి కూడా కాంట్రాక్ట్ పెట్టుకో : కేసీఆర్ కు షర్మిలా కౌంటర్

-

CM పదవి కూడా కాంట్రాక్ట్ పెట్టుకో అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్ షర్మిలా కౌంటర్ ఇచ్చారు. టీచర్ నుండి డాక్టర్ దాక అందరిని కాంట్రాక్ట్ పెట్టుకొంటే, CM పదవి కూడా కాంట్రాక్ట్ పెట్టుకొంటే సరిపోదా? అంటూ ఎద్దేవా చేసింది షర్మిల.

తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ పదమే ఉండదని చెప్పిన KCR గారు, ఇప్పుడు మీ పరిపాలన అంత కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితోనే నడిపిస్తున్నారు కదా? అని నిలదీశారు. ఏండ్ల తరబడి నోటిఫికేషన్స్ ఇచ్చింది లేదని ఫైర్ అయ్యారు.

కాంట్రాక్టు ఉద్యోగులతో చాకిరి చేయించుకొంటూ చాలీచాలని జీతాలతో వారి శ్రమ దోచుకొంటూ మరోవైపు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులు చనిపోయేలా చేస్తున్నావని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలే కాకుండా అవుట్ సోర్సింగ్ ఖాళీలను కూడా రెగ్యులర్ గా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను కూడా తరిమికొట్టాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news