అమ్మాయిల వంక చూస్తే గుడ్లు పీకేస్తానన్న KCR..గడీ దాటింది లేదు – షర్మిల

-

అమ్మాయిల వంక చూస్తే గుడ్లు పీకేస్తానన్న KCR..గడీ దాటింది లేదని ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల. మెడికల్‌ విద్యార్థి ప్రీతి మృతి చెందినట్లు ప్రకటించారు నిమ్స్ వైద్యులు. నిన్న రాత్రి 9:10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సంఘటనపై వైఎస్‌ షర్మిల స్పందించారు.

మెడికల్ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి మృతి అత్యంత బాధాకరమని చెప్పారు షర్మిల. వేధింపులు, ర్యాగింగ్ భూతానికి ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. కేఎంసీ ప్రిన్సిపల్ గతంలోనే స్పందించి, ఉంటే ప్రీతి ప్రాణాలు దక్కేవన్నారు. అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో KCR సర్కార్ విఫలం అయింది. అమ్మాయిల వంక చూస్తే గుడ్లు పీకేస్తానన్న KCR.. ఇంతవరకు గడీ దాటింది లేదని నిప్పులు చెరిగారు.

KCR నిర్లక్ష్యం వల్లే అల్లరిమూకలు రెచ్చిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రీతీని వేధించిన వ్యక్తితో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకొని, అమ్మాయిలకు రక్షణ కల్పించాలని YSRTP డిమాండ్ చేస్తోందన్నారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news