ప్ర‌యాణికుల‌కు షాక్‌.. ఆ రూట్ల‌లో బ‌స్సుల‌న్నీ ర‌ద్దు

-

తెలంగాణ‌లో ఈ రోజు నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే లాక్ డౌన్ నిన్న‌నే ప్ర‌క‌టించ‌డంతో చాలామంది ఊర్ల‌కు వెళ్ల‌డానికి నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. కొంత‌మంది సిటీకి రావ‌డానికి, మ‌రికొంద‌రు సిటీ నుంచి ఊర్ల‌ళ్ల‌కు వెళ్లేందుకు బ‌స్టాండుల‌కు క్యూ క‌డుతున్నారు. ఉద‌యం6 గంట‌ల నుంచి 10గంట‌ల వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సులు న‌డుపుతామ‌ని నిన్న ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

కానీ ఈ రోజు మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. కేవ‌లం బ‌స్ డిపో నుంచి 25 లేదా 30కిలోమీట‌ర్ల లోపే బ‌స్సుల‌ను తిప్పుతోంది ఆర్టీసీ. వెల్లి రావ‌డానికి 3గంట‌లు ప‌ట్టే రూట్ల‌లో మాత్ర‌మే బ‌స్సులు తిరుగుతున్నాయి అంత‌కంటే ఎక్కువ దూరం, ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే ప‌ట్ట‌ణాలు, సిటీల‌కు బ‌స్సుల‌ను ర‌ద్దు చేశారు అధికారులు.

ఇక ఇత‌ర జిల్లాల‌కు బ‌స్సుల‌ను పూర్తిగా నిలిపివేశారు. కేవ‌లం జిల్లాల లోప‌లే తిప్పుతున్నారు. ఇక హైద‌రాబాద్ కు వ‌చ్చే బ‌స్సుల‌ను అన్ని జిల్లాల్లో ఆపేశారు. దీంతో ప్ర‌యాణికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏ మాత్రం ఇన్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌కుండా ఏంటీ చ‌ర్య‌ల‌ని మండి ప‌డుతున్నారు. క‌నీసం లాక్‌డౌన్‌కు రెండు రోజులు టైమ్ ఇచ్చిన ఎవ‌రి ఇండ్ల‌కు వాళ్లం వెళ్లేవాళ్ల‌మంటూ తీవ్ర అసంతృప్తి తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news