సింగరేణి కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. జూన్ నెల నుంచి కొత్త వేతనాలు అమలు చేయనున్నారు. పెరిగిన వేతనాల ప్రకారం కేటగిరి-1 ఉద్యోగులకు బేసిక్ పే రూ.26,293 నుంచి రూ.39690 కి పెరగనుంది. దీంతోపాటు అలవెన్సులను 25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు జాతీయ కార్మిక సంఘాల మధ్య 11 వ వేతన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. కాగా, తెలంగాణకు మరో 2 ఐటీ సంస్థలు రానున్నాయి.
కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తుండగా హైదరాబాదులో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని మండీ హోల్డింగ్స్ సంస్థ ప్రకటించింది. సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ చైర్మన్ తెలిపారు. మరోవైపు హైదరాబాదులో 10,000 మంది ఉద్యోగులతో ఎంప్లాయి సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు VXI గ్లోబల్ కంపెనీ ప్రకటించింది.