IPL 2023 : మళ్లీ రెచ్చిపోయిన నవీన్ ఉల్ హక్

-

IPL 2023 లో భాగంగా నిన్న రసవత్తరమైన పోరు జరిగింది. ఈ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ మరో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ విజయం కోసం రింకు సింగ్ ఆఖరి బంతి వరకు చేసిన పోరాటం వృధా అయ్యింది.

అయితే.. ఈ మ్యాచ్‌ లో దుందుడుకు స్వభావంతో విమర్శలు ఎదుర్కొంటున్న లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హాక్ మరోసారి రెచ్చిపోయాడు. నిన్న KKR బ్యాటర్ గురుబాజ్ క్యాచ్ ను రవి బిష్నోయ్ అందుకోగానే నవీన్ సంబరాలు చేసుకున్నాడు. నోటిఫై వేలు వేసుకొని సైలెంట్ గా ఉండండి అంటూ KKR ఫ్యాన్స్ వైపు చూపించాడు. కాగా, ఈ మ్యాచ్ లో నవీన్ 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 46 పరుగులు సమర్పించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news