తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన నూతన బోటును ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ని అధికారికంగా జరుపుతున్నాం అని పేర్కొన్నారు. ఆత్మ గౌరవం కోసం సర్వాయి పాపన్న పోరాటం చేశారు. 10 మంది తో మొదలైంది ఆయన సైన్యం.. చివరగా గోల్కొండ పై జెండా ఎగుర వేసారు. తెలంగాణ పోరాటం కూడ అలాగే జరిగింది అని గుర్తు చేశారు. జిల్లా గౌడ సంఘం కోసం 2 ఎకరాల స్థలం ను అందిస్తున్నామని తెలిపారు. సంఘ భవన నిర్మాణం కోసం 2 కోట్లు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇది మీ ప్రభుత్వం.. మీ ఆశీర్వాదం తో ఇక్కడ ఉన్నామని.. కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం, 4 కోట్ల మందికి కేసీఆర్ కుటుంబ సభ్యులు పెద్దగా ఉంటున్నారు. రాష్ట్రం లోనే సిరిసిల్ల జిల్లా లోనే మొదటి సారిగా safety మోకులు అందిస్తాం అని తెలిపారు. సిరిసిల్ల లో బోటింగ్ లాంచ్ ఓపెన్ చేయడంతో పాపికొండలు లాగా తయారీ అయిందన్నారు. మల్కపేట నుంచి సింగ సముద్రం నుంచి నీళ్ళు వస్తాయి. శాశ్వతంగా 365 రోజులు నీళ్ళు ఉండేలా చేస్తున్నాం అని తెలిపారు కేటీఆర్.