BRS లోకి బీజేపీ ఎంపీ సొయం బాపురావు ?

-

BRS లోకి బీజేపీ ఎంపీ సొయం బాపురావు వెళతారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బీజేపీ ఎంపీ సొయం బాపురావు చర్చలు చేస్తున్నారట బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు. బీజేపీ నేతలే నాకు టికెట్‌ రాకుండా ఆపేశారంటూ బీజేపీ ఎంపీ సొయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ప్రకటించిన బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ లో బీజేపీ ఎంపీ సోయం బాపురావు లేదన్న సంగతి తెలిసిందే.

అయితే.. టికెట్‌ తనకు రాకపోవడంపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నాకు టికెట్ రాకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఫైర్‌ అయ్యారు.ఆదివాసీ బిడ్డ రెండో సారి గెలిస్తే ఎక్కడ కేంద్రమంత్రి అవుతాడో అని భయంతో నాకు టిక్కెట్ రాకుండా చేశారు బీజేపీ తెలంగాణ అగ్రనేతలు అంటూ ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు.

కొమ్మపై ఆధారపడ్డొడిని కాదు స్వతాహా ఎగరగలను, రెండో జాబితాలో టిక్కెట్ వొస్తుంది అని భావిస్తున్న రాకపోతే నా దారి నేను చూసుకుంటానన్నారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు. దీంతో BRS లోకి బీజేపీ ఎంపీ సొయం బాపురావు వెళతారని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news