తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ఠ్. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం అయ్యాయి. ఇవాళ్టి నుంచే ఏకంగా 9 రోజులు పాటు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగానే.. తొమ్మిది రోజులు పాటు 16 వాహనాలు పై భక్తులకు దర్శనం ఇవనున్నారు మలయప్పస్వామి. అటు తొమ్మిది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టిటిడి.
కేవలం సర్వదర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైనులు ద్వారా భక్తులును దర్శనానికి అనుమతించనుంది టిటిడి. అలాగే 6 లక్షల లడ్డులు నిల్వలు….నిత్యం 4 లక్షల లడ్డులు తయ్యారు చేసేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ పాలక మండలి. అటు సిఫార్సు లేఖల పై వసతి గదులు కేటాయింపు విధానం రద్దు చేశారు అధికారులు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన గదులు కేటాయింపులు చేస్తున్నారు. 24 గంటల పాటు ఘాట్ రోడ్డులో వాహనాలు అనుమతి కల్పించారు. కానీ నడకదారిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.