ఉగ్రవాదులు, వారి మద్దతు దారులపై కఠిన చర్యలు : ప్రధాని మోడీ

0
17

ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని మోడీ అన్నారు. దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను మోడీ ప్రస్తావించారు.

ఉగ్రవాదం మానవాళికి అతి పెద్ద ముప్పు అన్నారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదం పై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. అందుకు ఆ దేశానికి  కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేము కట్డుబడి ఉన్నామని మోడీ పునరుద్ఘాటించారు. మానవాళికి టెర్రరిజం అతిపెద్ద ముప్పు అని.. ఇరు దేశాలు విశ్వసిస్తున్నాయని తెలిపారు. టెర్రరిస్టులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రధాని మోడీ.