స్కూల్​లో మందుకొట్టిన విద్యార్థులు.. టీచర్​ను ఇరికించేందుకు ట్రై చేసి.. చివరకు

-

స్కూల్​లో మద్యం సేవిస్తూ కొంత మంది విద్యార్థులు దొరికిపోయారు. దొరకగానే టీచర్​పై నింద వేసేందుకు ప్రయత్నించారు. కానీ చివరకు ఇరుకునపడి.. మందు తాగింది నిజమేనని ఒప్పుకున్నారు. ఈ సంఘటన ములుగు మండలం మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. చెందిన పలువురు విద్యార్థుల అసాంఘిక వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలలో మద్యం తాగుతూ దొరికిపోగా ఉపాధ్యాయుడిపై నింద మోపేందుకు ప్రయత్నించి ఇరుకున పడ్డారు. విద్యార్థులు మద్యం తాగింది వాస్తవమేనని విచారణలో తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఏమీ మాట్లాడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న 9 మంది విద్యార్థులు శనివారం రాత్రి మద్యం సేవించారు. గమనించిన వ్యాయామ ఉపాధ్యాయుడు వారిని మందలించారు.మరుసటి రోజు ఉదయం చెప్పా పెట్టకుండా విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. వ్యాయామ ఉపాధ్యాయుడే మద్యం తాగి తాము తాగినట్లు ఒప్పంద పత్రం రాయించుకున్నాడని తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లల మాటలు నమ్మిన తల్లిదండ్రులు మరుసటి రోజు పాఠశాలకు వచ్చి వ్యాయామ ఉపాధ్యాయుడితో వాగ్వాదానికి దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణ స్వామి పాఠశాలకు వెళ్లి విచారణ జరపగా అసలు విషయం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news