తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 దాటుతున్న ఉష్ణోగ్రతలు

-

తెలంగాణలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా వేడిగాలులు, ఎండల తీవ్రత పెరిగింది. వేసవి తొలినాళ్లలోనే ఈ రేంజ్ లో ఎండలు ఉంటే వచ్చే ఎప్రిల్, మే నెలల్లో ఏవిధంగా ఉష్ణోగ్రతలు నమోదుతాయో అని జనాలు భయపడుతున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. 

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొడివాతావరణ నెలకొననుంది. గత 24 గంటల్లో పెద్దపల్లి జిల్లా మంథనిలో అత్యధికంగా 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా అల్లీపూర్ లో 40 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లెలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత, నారాయణపేట జిల్లా మరికల్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రం భీం జిల్లా సిర్పూర్ లో 13.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతారణ శాఖ వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 21 వరకు నమోదు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news