సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లకు బిగ్ షాక్ ఇచ్చింది అధికార బీఆర్ఎస్ పార్టీ. గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న…సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై సస్పెండ్ వేటు వేసింది బీఆర్ఎస్ పార్టీ.
వీరిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ సస్పెండ్ చేసింది కెసిఆర్ పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. కాగా గత రాత్రి కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి మహబూబ్ నగర్ జిల్లా బి అసంతృప్తి నేత జూపల్లి కృష్ణా రావు కూడా హాజరు అయ్యారు. దీనితో అసంతృప్తి నేతల పై సస్పెన్షన్ వేటు బిఆర్ఎస్ నాయకత్వం వేస్తుంది .ఈ నేపథ్యంలో పొంగులేటి ఇంటి వద్ద బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.