జనవరి టు నవంబర్ .. స్విగ్గీ-2023 రిపోర్ట్ లో క్రేజీ ఆర్టర్లు

-

హైదరాబాద్ అనే పేరు వినగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది బిర్యానీ. మొదటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వారైనా.. చదువు, ఉపాధి, ఇతర పనుల నిమిత్తం నగరానికి వచ్చిన వారైనా హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అవ్వాల్సిందే. ఇక్కడి నగర వాసులు బిర్యానీని అమితానందంగా ఆరగిస్తారు. అందుకే హైదరాబాద్ బిర్యానీకి మరింత ఎక్కువ ఫేమస్ అవుతోంది. ముఖ్యంగా ఆన్లైన్ ఫుడ్ డెలవరీల్లో కూడా బిర్యానీలదే అగ్రస్థానం ఉంటోందట.

విందులో బిర్యానీని ఇష్టంగా ఆరగిస్తున్న నగరవాసులు స్నాక్‌గా బన్‌ మస్కా రుచికి ఫిదా అవుతున్నారట. 2023 జనవరి నుంచి నవంబరు 15 వరకు తమకు వచ్చిన ఆర్డర్ల ఆధారంగా ఆహారపుటలవాట్ల పోకడలపై స్విగ్గీ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో పొందుపరిచిన వివరాలు చూస్తే నగర వాసుల క్రేజీ ఆర్డర్లు.. పాపులర్ ఫుడ్ హాబిట్స్ తెలిసిపోతాయి. మరి మనమూ ఓ లుక్కేద్దామా..?

స్విగ్గీ నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా ఓ వ్యక్తి 1633 బిర్యానీలు ఆర్డర్‌ ఇచ్చారట. మరో వ్యక్తి ఒకే ఆర్డర్‌లో రూ.37,008 బిల్లు చేశారట. నగరవాసులు ఎక్కువగా చికెన్‌ బిర్యానీ, మసాల దోశ, బటర్‌నాన్‌, చికెన్‌ 65, ఇడ్లీ తెప్పించుకున్నారట. ఒక వ్యక్తి ఏడాది కాలంలో రూ.6 లక్షల ఇడ్లీలను ఆర్డర్‌ ఇచ్చారట. cరి మన భాగ్యనగరవాసులు ఎక్కువగా స్నాక్‌లలో చికెన్‌ పాప్‌కార్న్‌, హాట్‌ చికెన్‌ వింగ్స్‌, వెజ్‌పఫ్‌, సమోసా, తీపిలో డబుల్‌ కా మీఠా, అప్రికాట్‌ డిలైట్‌, గులాబ్‌ జామున్‌, చాకో లావ కేక్‌, డబుల్‌ డార్క్‌ చంక్‌ చాక్లెట్‌ కూకీ ఇష్టపడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news