నేటి నుంచి టీ-శాట్‌లో డిజిటల్‌ పాఠాలు

-

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో డిజిటల్ పాఠ్యాంసాలు ప్రసారం చేసేందుకు టీ-శాట్ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా విద్యార్థులకు పాఠాలను డిజిటల్ పద్ధతిలో ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పూర్తి స్థాయి డిజిటల్‌ పాఠాలు సోమవారం (జులై 1వ తేదీ 2024) నుంచి ప్రసారం చేయనున్నట్లు టీ- శాట్‌ నెట్‌వర్క్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్యాంశాల షెడ్యూలును టీ శాట్ నెట్వర్క్ ప్రకటించింది. ఈ ఏడాదికి 223 పాఠశాల పని రోజులకు సంబంధించి 749 గంటల కంటెంట్‌తో 1498 పాఠ్యాంశాలు విద్యా ఛానెల్‌లో ప్రసారం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పాఠ్యాంశాల బోధన ప్రసారాలు జరుగుతాయని టీ శాట్ వివరించింది. లైవ్‌ పాఠాలు వినలేకపోయిన వారికి టీ-శాట్‌ యాప్, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటాయని టీ-శాట్‌ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news