బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ తీవ్ర విగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్టు తీరును తప్పు పట్టారు. బండి సంజయ్ ని అరెస్ట్ చేయడానికి నిర్దిష్ట కారణాలను చూపడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. అధికారాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూను బిజెపి ప్రశ్నిస్తున్నందుకే తమ నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ వ్యవస్థను కేసీఆర్ గౌరవించడం లేదని మండిపడ్డారు. సంజయ్ కోసం బిజెపిలోని ప్రతీ కార్యకర్త పోరాడుతారని చెప్పారు. ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు భయపడి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.