Telangana : రాష్ట్రంలో నేటి నుంచే టీచర్ల పదోన్నతులు, బదిలీలు

-

రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి అర్హులైన వారి జాబితా నేడు వెలువడనుంది. ఉపాధ్యాయ దంపతులను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినందున.. మొత్తంగా 9 వేల 700 మందికి పదోన్నతులు, దాదాపు 30 వేల మందికి బదిలీలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు అందిన 15 రోజుల్లో సంబంధిత అధికారులు వాటిని పరిష్కరిస్తారు.

ఈ బదిలీల ప్రక్రియ వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా జరుగుతున్నట్లు పాఠశాల విద్యా శాఖ చెబుతున్నప్పటికీ.. పైరవీలతో దొడ్డిదారిన ఉత్తర్వులు వస్తున్నాయన్న ఆరోపణలు మొదలయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్, ఇతర పట్టణ ప్రాంతాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా రాజకీయ పలుకుబడితో బదిలీ ఉత్తర్వులు ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news