హైదరాబాద్‌లో రూ.1250 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ

-

తెలంగాణకు పెట్టుబడుల వర్షం కురుస్తోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలో తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి కొన్ని సంస్థలు .. తమ సంస్థ విస్తరణకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫ్రెంచ్‌-అమెరికన్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ దిగ్గజం అయిన టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.

సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ అండ్‌ ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీకి హైదరాబాద్‌ను టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ కేంద్రంగా ఎంచుకుంది. రూ.1250 కోట్లతో నగరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఇంజినీరింగ్‌ విభాగంలో 2500 ఉద్యోగాలు, తయారీ రంగంలో మరో వెయ్యి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా మరో 3500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. టెక్నిప్‌ ఎఫ్‌ఎంసీ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల హైదరాబాద్‌కు అదిపెద్ద ప్రోత్సాహం లభించినట్లయిందని, నగర సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news