BREAKING : తీన్మార్ మల్లన్న అరెస్ట్..వరంగల్ కు తరలింపు !

-

ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న కు ఊహించని షాక్ తగిలింది. ఆయనను కాసేపటి క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లో రైతులకు మద్దతుగా వెళ్తున్న తీన్మార్ మల్లన్న ను ముందస్తుగా ప్రివెంటివ్ అరెస్టు చేశారు వరంగల్ పోలీసులు.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న
Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

తీన్మార్ మల్లన్న అరెస్టు చేసిన అనంతరం వరంగల్లోని లింగాల గణపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.వరంగల్ లో లాండ్ పూలింగ్ రియల్ మాఫియా జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి తీన్మార్ మల్లన్న వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇది ఇలా ఉండగా… ఇటీవలనే బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. తాను ఇక నుంచి బీజేపీ పార్టీ ఆఫీసుకు వెళ్లబోనని స్పష్టం చేశారు. అలాగే సీఎం కేసీఆర్ ను కూడా తిట్టాను అని శపథం చేశారు తీన్మార్ మల్లన్న. అయితే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాత్రం తీన్మార్ మల్లన్న ప్రకటించకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news