తెలంగాణాలో బీజేపీ హై కమాండ్ ఒక విధానాన్ని తీసుకువచ్చింది. రాబోయే ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేయాలి అనుకుంటున్నా నేతలు ఎవరైనా ఒక పద్దతి ప్రకారం దరఖాస్తును చేసుకోవాల్సిందని తెలియచేసింది. ఈ రోజుతో నాలుగు రోజులు పూర్తి కాగా, మొదటి మొదటి మూడు రోజులలో కేవలం 666 మంది మాత్రమే దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా మారిపోయింది. కేవలం ఈ ఒక్క రోజులోనే 333 మంది అబ్యర్ధులు బీజేపీ తరపున పోటీ చేయడానికి ఆసక్తిని కనబరిచారు. దీనితో దరఖాస్తుల సంఖ్య 999 కు చేరుకుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి బీజేపీ హై కమాండ్ ఇచ్చిన సమయంలో కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈనెల మూడవ తేదీ నుండి స్టార్ట్ అయిన దరఖాస్తు ప్రక్రియ 10వ తేదీతో ముగియనుంది.
ఇక ఈ అప్లికేషన్ లు చేసుకున్న వారిలో ఎంతమందికి టికెట్ లను హై కమాండ్ ఖరారు చేస్తుంది.. మరియు ఇందులో ఏమైనా పక్షపాతాలు ఉంటాయా ? అన్నది తెలియాలంటే తుది జాబితా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.