రోహిత్ శర్మ మైండ్ ను ఆఫ్రిది పూర్తిగా చదివేశాడు: షోయబ్ అక్తర్

-

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ రావల్పిండి ఎక్ష్ప్రెస్స్ షోయబ్ అక్తర్ ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన తాజాగా సోషల్ మీడియా వేదికగా మెసేజ్ చేస్తూ… రోహిత్ శర్మ మైండ్ ను పాకిస్తాన్ బౌలర్ షహీన్ ఆఫ్రిది పూర్తిగా చదివేశాడు అంటూ కామెంట్ చేశాడు. రోహిత్ శర్మ అప్పటిలా లేడు, పూర్తిగా మారిపోయాడు, ఇప్పటి వరకు తన స్టాన్స్ మార్చుకోవడం నేను చూడలేదు. కానీ మొన్న ఆసియ కప్ లో పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్రిది బౌలింగ్ లో మార్చడం చూశాను. కానీ ఏమి లాభం అతని బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు అంటూ మాట్లాడారు అక్తర్. రోహిత్ కు ఏ విధంగా బౌలింగ్ వేస్తే వికెట్ వస్తుందో ఆఫ్రిది కి బాగా తెలుసని చెప్పాడు అక్తర్. కాగా ఆసియ కప్ లో రోహిత్ శర్మ ఆఫ్రిది బౌలింగ్ లో ఎటూ చేయలేక తడబడి తడబడి వికెట్ ను అతనికే బౌల్డ్ రూపంలో ఇచ్చేశాడు.

మరి ఈ ఆసియ కప్ లో మరోసారి ఇద్దరూ తలపడుతుండగా ఈసారైనా అతనిపై రోహిత్ శర్మ పైచేయి సాధిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news