ఫిబ్రవరి తొలివారంలో తెలంగాణ బడ్జెట్.. 3లక్షల కోట్ల దాకా ఉండే అవకాశం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి తొలి వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు విశ్వాసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్టు తెలిసింది. వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్ ను మార్చి మొదటి వారంలో ప్రవేశ పెడుతుంటారు.

అయితే సీఎం కేసీఆర్ కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత వేగం మరింత పెరిగింది. ముఖ్యంగా ఖమ్మం సభతో దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మూడు రాష్ట్రాల సీఎంలు, ఇద్దరు జాతీయ పార్టీల కీలక నేతలు హాజరు కావడంతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news