దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 4 దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ దేశవ్యాప్తంగా చాలా రసవత్తరంగా కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాలను చూసినట్టయితే.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక ఏపీలో కూటమికి, వైసీపీకీ పోటీ చాలా రసవత్తరంగా కొనసాగించింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు రాత్రి 12 గంటలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో కేరళకు తెలంగాణ నాయకులు బయలుదేరారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఖమ్మం ఎమ్మెల్యే లు కొచ్చిన్ కు ప్రయాణం చేశారు. హైదరాబాద్ నుండి ఇండిగో విమానం లో కొచ్చిన్ కు బయలుదేరారు. ఇక అదే విమానం లో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. వేసవి విడిదా లేదా రాజకీయ ట్రిప్ హా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం కేరళకు బయలుదేరి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.