కరోనా విషయంలో కేసీఆర్ పనితీరు… దుబ్బాక చెప్పబోతోందా?

-

కరోనా టెస్టులు, నియంత్రణ, పాజిటివ్ కేసుల విషయంలో శ్రద్ధ, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ… వెరసి తెరాస సర్కార్ పై రకరకాల విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే! ఈ విషయంలో కేసీఆర్ సర్కార్ ఇప్పుడిప్పుడే మేల్కంటున్నట్లు కనిపిస్తుంది కానీ… చాలాకాలం వరకూ మొదట్లో చూపించిన శ్రద్ధ పెట్టలేదని కామెంట్లు కనిపించాయి. ఈ క్రమంలో… దుబ్బాకలో జరగబోయే ఉప ఎన్నికలు కరోనా సమయంలో కేసీఆర్ ఫెర్మార్మెన్స్ కు రెఫరెండంగా మారబోతున్నాయనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!

ఎవరైనా ఎమ్మెల్యే మృతిచెందితే.. అక్కడ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మిగిలిన పార్టీలు సహజంగా పోటీకి నిలబడవు! కానీ… ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో… దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతోందని చెబుతున్నారు ఉత్తం కుమార్ రెడ్డి! ఈ మేరకు తాజాగా స్పందించిన ఆయన… పోటీ విషయంలో ఎవరూ అనుమానపడాల్సిన అవసరం లేదని.. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోందని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని పోటీ పెట్టడం వల్ల… కరోనా విషయంలో కేసీఆర్ ఫెర్ఫార్మెన్స్ పై రెఫరెండంగా భావించి, ప్రజలకు అలాంటి సంకేతాలు ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు! కాగా… దుబ్బాక తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news