పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

-

తెలంగాణ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నిర్వహించిన తుది పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఇవాళ ఉదయం నుంచి నియామక మండలి వెబ్‌సైట్‌ ‌www.tslprb.in లో అందుబాటులో ఉంటుంది. పోలీసు శాఖలోని వివిధ విభాగాలతోపాటు ఆబ్కారీ, రవాణాశాఖల్లో కానిస్టేబుళ్ల భర్తీకి గత నెలలో తుది పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో డ్రైవర్లు, మెకానిక్‌ల వంటి కానిస్టేబుల్‌ సమానస్థాయి పోస్టులూ ఉన్నాయి.

ఆయా విభాగాల వారీగా తుది పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులకు ఏవైనా ప్రశ్నలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్లోనే తెలుపవచ్చు. ఒక్కో అభ్యంతరానికి ఒక్కో టెంప్లెట్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. తమ అభ్యంతరాన్ని ధ్రువీకరించే ఆధారాలను కూడా అందులోనే అప్‌లోడ్‌ చేయొచ్చు. ఈ నెల 24 వరకూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు. తెలంగాణ పోలీసు నియామక మండలి నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఏప్రిల్ 30న జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news