కేటీఆర్ కి ట్విట్టర్ తప్పితే బయటకు వచ్చి మాట్లాడే టైం లేదు అని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి అన్నారు. మా మత్స్యకారుల ను దగా చేసింది మీరు. మా సంపద అంతా దోచుకున్నాడు మీ బావ. మా ఉసురు తగిలే.. ఇంట్లో కూర్చున్నారు మీరు. కాయ కష్టం చేసుకునే మత్స్య కారుల సంపద దోచుకున్నారు. తొమ్మిదేళ్లు మీరు మా అందరి రక్తం తాగారు అని పేర్కొన్నారు.
ఇక ఆంధ్ర కాంట్రాక్టర్లతో లాలూచీ పడి.. మా పొట్ట కొట్టారు. అసలు కేటీఆర్.. మాట్లాడేది నోరా.. మోరా. 570 మంది మత్స్యకారులు చనిపోతే ఎక్సగ్రెషియ ఇవ్వలేదు మీరు. కాస్తైనా సిగ్గుండాలి.. మాట్లాడటానికి. ఒక్క వారం లో మీ బావ, బామ్మర్దిలు ఏం చేశారో బయట పెడతాం. ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు కేటీఆర్. 10వ తేదిన మీ అక్రమాలు అన్నీ బయట పెడతా అని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అన్నారు.