తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపే ఆ నోటిఫికేషన్

-

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు  ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. కేజీబీవీలు, మోడల్, సాధారణ, ఎయిడెడ్, జనరల్ గురుకుల పాఠశాలలు మొత్తం కలిపి 28,514 స్కూళ్లకు ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నారు.

అయితే ఒకటో తరగతి నుంచి 8 తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులను ఎన్నుకుంటారు. శనివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తల్లిదండ్రులు జాబితాను నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తారు. అయితే 2019 లో చివరి సారిగా ఈ ఎన్నికలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈ విద్యాకమిటీ ఐదేళ్ల పాటు కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ అయినప్పటికీ ఎన్నికల నిర్వహించలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఎన్నికలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news