టెట్‌ పరీక్షలు రాసే వారికి తెలంగాణ సర్కార్‌ శుభవార్త

-

టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు. మే మాసం లో ఈ పరీక్ష నిర్వహించవచ్చని సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడం ఇది మూడోసారి.

గతంలో 2016 మే అలాగే 2017 జులై లో ఈ టెట్ పరీక్షను నిర్వహించారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి టెట్ లో అర్హత సాధిస్తే అది ఒక్కదానికి ఇప్పటివరకు ఏళ్ల కాల పరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్ రాసుకోవాలి సిందే. అందుకు భిన్నంగా ఈసారి టెట్ అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పులు చేయాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో టెట్ రాసే వారికి భారీ కలగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news