తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచి పెడుతుంది : నిర్మలా సీతారామన్

-

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని దుయ్యబట్టారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మధురానగర్ లో నిర్వహించిన మిట్ ది గ్రీట్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బంగారు తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేసారని ధ్వజమెత్తారు.

ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని.. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగ్గా పూర్తి చేయలేదని.. విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తాననే హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడాతున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news