వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ లో ప్రక్షాళన ఎలా ఉందంటే !

-

ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఏ విధంగా ఫెయిల్ అయిందో తెలిసిందే. కనీసం సెమి ఫైనల్ కు కూడా చేరకుండానే ఇంటిదారో పట్టి చాలా విమర్శలకు అవకాశం ఇచ్చింది అని చెప్పాలి. ఈ వైఫల్యం కారణంగా పాకిస్తాన్ జట్టులో యాజమాన్యం చాలా మార్పులను చేసింది.. దాదాపు అన్ని కీలక పదవులలో ఉన్న వ్యక్తులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ లో జరిగిన మార్పులు ఏమిటన్నది చూస్తే, అందులో భాగంగా కొత్త టీ 20 కెప్టెన్ గా ఫాస్ట్ బౌలర్ షహీన్ ఆఫ్రిదిని నియమించుకుంది. అదే విధంగా టెస్ట్ కెప్టెన్ గా షాన్ మసూద్ కు బాధ్యతలను అప్పగించింది. హెడ్ కోచ్ మరియు టీం డైరెక్టర్ గా మాజీ పాకిస్తాన్ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్ ను తీసుకుంది.

ఇక ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా వాహబ్ రియాజ్ ను మరియు స్పిన్ బౌలింగ్ కోచ్ సయీద్ అజ్మల్ ను నియమించుకుంది. మరి కొత్తగా ఏర్పడిన ఈ టీం ఏ విధమైన ప్రదర్శనను జట్టు నుడి రాబట్టుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news