వైద్యుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు…!

-

ప్రజా ఆరోగ్య కేంద్రాలలో, సిహెచ్ సి లలోకి వైద్యులను నియమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందుకుగాను మొదటగా 225 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ లను ఒప్పంద ప్రాతిపదికన నిర్మించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోని ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లను ఆరు నెలల కోసం ఒప్పంద పద్ధతిలో నియామకాలను చేపడుతోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్ రెసిడెండ్ గా నియమించబోతుంది. ఇందుకోసం వారికి రూ. 70000 నెలకు వేతనం ఇచ్చే ఈ విధంగా ఓ ఏడాదికి ఒప్పందం ప్రక్రియ ద్వారా మొత్తం 1191 మందిని భర్తీ చేయనున్నారు.

docters
docters

వీరిని హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిలో 250, 8 ప్రభుత్వం వైద్యశాలకు 50 మంది చొప్పున మొత్తం 400, గచ్చిబౌలి టీమ్స్ కు సంబంధించి 150, కింగ్ కోటి హాస్పిటల్ కి 100, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు 241 మందిని నియమించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news