మరో రూ.2,000 కోట్ల అప్పు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం !

-

మరో రూ.2,000 కోట్ల అప్పు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 6వ తేదీ జరగనున్న ఆర్బీఐ వేలంలో రూ.2,000 కోట్ల అప్పు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే, ఇందిరమ్మ ఇళ్లు మరియు ఆరు గ్యారంటీల వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి భారీగా నిధుల సమీకరణ కోసం 2,620 ఎకరాల భూములు అమ్మేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.

డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ పరిధిలో ఉన్న 1,800 ఎకరాలు మరియు హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న 820 ఎకరాల భూములు ఉండగా కబ్జాలకు గురవుతున్నాయి.. కాపాడలేము అనే సాకు చెప్పి వేలం వేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

ఇది ఇలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 4న తెలంగాణ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. అయితే… బడ్జెట్ సమావేశాలపై ఈ నెల 4న తెలంగాణ కేబినేట్‌ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news